Pathan Movie Row : ‘పఠాన్’ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్
సినిమా..పాటల్లో మార్పులు చేయాల్సిందే
Pathan Movie Row : సెన్సార్ బోర్డు కోలుకోలేని షాక్ ఇచ్చింది పఠాన్ మూవీ నిర్మాతలకు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ సినిమాలో ప్రముఖ నటీ నటులు షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే నటించారు. ప్రధానంగా మూవీకి సంబంధించి చిత్రీకరించిన బేషరమ్ రంగ్ పాట తీవ్ర వివాదం చోటు చేసుకుంది.
ఇందులో అభ్యంతరకరంగా దుస్తులు ఉన్నాయంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరం తెలిపారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం, ఇంకొన్ని రాష్ట్రాలలో దీనిని రానివ్వమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరాఠాలో అయితే ఎమ్మెల్యే రామ్ కదమ్ నిప్పులు చెరిగారు.
వెంటనే నిలిపి వేయక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బేషరమ్ రంగ్ సాంగ్ యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. దీపికా పదుకొనే బికినీలో దర్శనం ఇవ్వడంపై మండిపడుతున్నారు. దీంతో సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు పై ఆగ్రహం వ్యక్తం కావడంతో కీలక వ్యాఖ్యలు చేసింది బోర్డు.
పఠాన్ మూవీకి(Pathan Movie Row) సంబంధించి మొత్తం సినిమాను, అందులోని పాటలను అందరూ చూసే విధంగా , ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మార్పులు చేయాలని సూచించింది. తిరిగి మరోసారి పఠాన్ ను చూస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ , పాటలు కూడా విడుదలయ్యాయి.
ఇదిలా ఉండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమా స్వేచ్ఛ గురించి కామెంట్స్ చేశారు. మరో వైపు పఠాన్ మూవీకి సంబంధించి దీపికా పదుకొనే, షారుఖ్ కు మద్దతు తెలిపారు ప్రకాశ్ రాజ్.
Also Read : ఖాన్ కిస్ సంగీతా బిజ్లానీ ఖుష్