Joe Biden Heera Ben : మోదీ తల్లి మృతి పట్ల బైడెన్ సంతాపం
పలువురు దేశ ప్రధానులు, అధ్యక్షుల ఆరా
Joe Biden Heera Ben : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరా బెన్ మృతి చెందడం పట్ల అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని(Joe Biden Heera Ben) కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రితో ఆరా తీశారు. ట్విట్టర్ వేదికగా శనివారం స్పందించారు యుఎస్ ప్రెసిడెంట్. ఆయనతో పాటు ప్రథమ మహిళా జిల్ బైడెన్ కూడా హీరా బెన్ మరణం పట్ల సంతాపం తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో మా ప్రార్థనలు పీఎం, అతని కుటుంబ సభ్యులతో ఉన్నాయని పేర్కొన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు సైతం తీవ్ర సంతాపం తెలిపారు. హీరా బెన్ మృతి చెందడం బాధాకరమని పేర్కొంది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ఫోరమ్ ట్వీట్ చేసింది.
ప్రియమైన తల్లిని కోల్పోయినందుకు తీవ్ర సంతాపం తెలియ చేస్తున్నట్లు యుఎస్ఐఎస్పీఎఫ్ చీఫ్ ముఖేష్ అఘీ పేర్కొన్నారు. ప్రముఖ ఆఫ్రికన్ , అమెరికన్ గాయని మాటి మిల్ బెన్ ప్రధానమంత్రికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మీకు మీ కుటుంబీకులకు ఈ సందర్భంగా ఆ దేవుడు ప్రశాంతతను తెలియ చేయాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
హీరా బెన్ కు సంబంధించిన గొప్ప వారసత్వం ఇప్పుడు మీలో కనిపిస్తోంది. భారత దేశంలో , ప్రపంచ వ్యాప్తంగా మీరు తాకిన ప్రతి ఆత్మలో ఉందని తెలిపారు. వీరితో పాటు జపాన్ , ఇజ్రాయెల్ , పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , నేపాల్ ప్రధానమంత్రులు కూడా హీరా బెన్ ఆత్మ కు శాంతి చేకూరాలని కోరారు.
Also Read : రిషబ్ పంత్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా