Shakuntalam Movie : ఫిబ్ర‌వ‌రి 17న రానున్న శాకుంత‌లం

ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న స‌మంత

Shakuntalam Movie : ప్ర‌ముఖ న‌టి స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రానికి సంబంధించి ఇవాళ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నే దానికి చెక్ పెడుతూ విడుద‌ల తేదీని ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు అంతా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న శాకుంత‌లం వ‌చ్చే నెల ఫిబ్ర‌వరి 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అధికారికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. బ‌హు భాషా పౌరాణిక నాట‌కం శాకుంత‌లం సినిమా(Shakuntalam Movie). ఈ చిత్రం ముందుగా న‌వంబ‌ర్ 4, 2022లో విడుద‌ల కావాల్సి ఉంది. కాగా రిలీజ్ చేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. ఈ ప్రేమ‌క‌థ‌ను 3డీ ఫార్మాట్ లో చూసే ఛాన్స్ ల‌భించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరోజున అంతా ఎదురు చూస్తున్న శాకుంత‌లం విడుద‌ల‌వుతుంద‌ని పేర్కొన్నారు మూవీ మేక‌ర్స్. ఈ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను దృశ్య కావ్యంగా మలిచిన‌ట్లు తెలిపారు. ప్ర‌ముఖుడైన ఆనాటి కాళిదాసు రాసిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా దీనిని రూపొందించారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.

గ‌తంలో ఆయ‌న ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు తీశారు. చారిత్రిక నేప‌థ్యం ఉన్న రుద్ర‌మ‌దేవిని తీశారు. శ‌కుంత‌ల‌, రాజు దుష్యంత్ ల పురాణ ప్రేమ క‌థ చుట్టూ తిరుగుతుంది. ఇందులో య‌శోద‌గా స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించ‌గా సుఫియం సుజాత‌యుం ఫేమ్ దేవ్ మోహ‌న్ లు దుష్యంతుడిగా న‌టించారు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇంకా ఈ సినిమాలో స‌చిన్ ఖేడేక‌ర్ , క‌బీర్ బేడీ, మోహ‌న్ బాబు, ప్ర‌కాశ్రాజ్ ,మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్ , అన‌న్య న‌గ‌ల్లా, జిషు సేన్ గుప్తా ఉన్నారు. హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

Also Read : ఈరోజే ముఖ్యం రేప‌టితో అన‌వ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!