Narayan Patel MLA : మెరుగైన రోడ్లు ప్రమాదానికి దారులు
మంచి రోడ్ల వల్లే ప్రమాదాలు - పటేల్
Narayan Patel MLA : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని అధికార బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రోడ్లను బాగు చేయడం వల్లనే ఇటీవల విపరీతమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక వేళ రోడ్లు బాగా లేకుంటే స్పీడ్ గా వెళ్లేందుకు ఛాన్స్ అంటూ ఉండదని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మంచి రోడ్లు అధిక వేగానికి దారి తీసేలా చేస్తాయని అన్నారు ఎమ్మెల్యే నారాయణ్ పటేల్(Narayan Patel MLA). ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాను అందరిని తప్పు పట్టడం లేదని, కానీ కొందరు డ్రైవర్లు మద్యం సేవించి నడపడం వల్లనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో ఇటీవల ప్రమాదాలు మరింతగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ్ పటేల్.
రహదారులను బాగు చేయడం వల్ల వాహనదారులు స్పీడ్ గా వెళ్లేందుకు ప్రయారిటీ ఇస్తారని , దీని వల్ల రోజూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా లోని మంధాన అసెంబ్లీ నియోజకవర్గానికి నారాయణ్ పటేల్(Narayan Patel MLA) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2017లో తన అమెరికా పర్యటనలో మధ్య ప్రదేశ్ లోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పడం విశేషం.
Also Read : మోడీ దీదీ మధ్య రహస్య ఎజెండా