Ram Rahim Cake Sword : కత్తితో కేక్ కట్ చేసిన రామ్ రహీమ్
పెరోల్ మీద బయటకు వచ్చిన రేప్ దోషి
Ram Rahim Cake Sword : ఈ దేశంలో రేపిస్టులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడినట్లు ఆధారలతో సహా జైలుకు వెళ్లిన రామ్ రహీమ్ పెరోల్ (Ram Rahim Cake Sword) మీద బయటకు వచ్చాడు. ఇతడిని బయటకు తీసుకు వచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే.
విచిత్రం ఏమటంటే ఆనందం పట్టలేక రామ్ రహీమ్ కేక్ ను ఏకంగా కత్తితో కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది. అత్యాచారాలు జరిపిన కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్ కు పెరోల్ మంజూరు కావడం గత 14 నెలల్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.
మూడు నెలల్లోపు ఇది రెండోసారి. అయితే ఆయుధ చట్టం ప్రకారం ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం ఉంది. ప్రస్తుతం పెరోల్ పై బయటకు వచ్చిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కత్తితో కేక్ కట్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
హర్యానా లోని రోహ్ తక్ జిల్లా లోని సునారియా జైలు నుండి 40 రోజుల పెరోల్ పై వచ్చాడు. నేరుగా అక్కడి నుండి ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ లోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నాడు. భారీ కేక్ తో రామ్ రహీమ్ చేసిన వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేస్తారా లేక చూసి ఊరుకుంటారా అన్నది చూడాలి.
Also Read : 29న గ్రీన్ వుడ్స్ ‘పతంగుల పండుగ’