Odisha Minister Das Shot : ఒడిశా మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు

చికిత్స నిమిత్తం మంత్రి ఆస్ప‌త్రికి

Odisha Minister Das Shot : ఒడిశా రాష్ట్రంలో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రిపై ఓ పోలీస్ కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి న‌బా కిశోర్ దాస్(Odisha Minister Das Shot) పై ఆదివారం ఝూర్సుగూడ జిల్లాలోని బ్ర‌జ‌రాజ్ న‌గ‌ర్ స‌మీపంలోని గాంధీ చౌక్ వ‌ద్ద అసిస్టెంట్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ కాల్పులు జ‌రిపాడు. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మంత్రిపై కాల్పులు జ‌ర‌ప‌డంతో ఛాతీకి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఏఎస్ఐ రెండు రౌండ్లు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆరోగ్య శాఖ మంత్రి కిషోర్ దాస్ ను హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విమానంలో భువనేశ్వ‌ర్ కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా అసిస్టెంట్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ ఆఫ్ పోలీసు (ఏఎస్ఐ) గోపాల్ దాస్ మంత్రి మంత్రి పై కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో మంత్రి తీవ్రంగా గాయ‌ప‌డ్డారని బ్ర‌జ్ రాజ్ న‌గ‌ర్ స‌బ్ డివిజ‌నల్ పోలీస్ ఆఫీస‌ర్ గుప్తేశ్వ‌ర్ భోయ్ తెలిపారు. ఆయ‌న ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు.

వాహ‌నం లోంచి దిగ‌గానే మంత్రిపై కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. కాగా దాడి చేయ‌డం వెనుక గ‌ల కార‌ణం ఏమిట‌నేది ఇంకా తెలియ రాలేదు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో మంత్రి కిషోర్ దాస్ ను కారు వ‌ద్ద‌కు తీసుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : ప‌శ్చిమ బెంగాల్ నా రెండో ఇల్లు

Leave A Reply

Your Email Id will not be published!