S Jai Shankar : మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రూ లేరు

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్

S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రూ లేర‌ని స్ప‌ష్టం చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే మోడీ త‌ప్ప ఇంకే నాయ‌కుడికి ప్ర‌ధాని అవుతామో తెలియ‌ని స్థితిలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు.

సామాన్యంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల జోలికి వెళ్ల‌రు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar). ఇదే స‌మ‌యంలో తాను విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో విచిత్ర‌మైన అనుభ‌వాలు క‌లిగాయ‌ని తెలిపారు ఎస్ జై శంక‌ర్. త‌న‌ను అర్థం చేసుకునే కేంద్ర మంత్రి ఉండే వార‌ని గుర్తు చేసుకున్నారు.

ఆమె ఎవ‌రో కాదు సుష్మా స్వ‌రాజ్ అని కొనియాడారు. ఇవాళ ఆమె భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోవ‌చ్చు..కానీ ఆమె ఈ దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచార‌ని పేర్కొన్నారు. మంత్రి, కార్య‌ద‌ర్శి అన్న భేదమే లేకుండా కొన‌సాగింద‌ని , అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఇప్పుడు త‌న‌కు న‌రేంద్ర మోడీకి, కేబినెట్ మ‌ధ్య ఉంద‌న్నారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.

విదేశాంగ కార్య‌ద‌ర్శి కావ‌డ‌మే 10 ఏళ్ల కింద‌ట త‌న ఆశ‌యానికి అత్యున్న‌త ప‌రిమితి అని పేర్కొన్నారు. మోడీ త‌ప్ప మ‌రెవ‌రైనా త‌న‌ను మంత్రిగా నియ‌మిస్తారో లేదో ఖ‌చ్చితంగా తెలియ‌ద‌ని అన్నారు. అదే మంత్రిత్వ శాఖ‌లో కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన జై శంక‌ర్(S Jai Shankar) త‌న పుస్త‌కం ది ఇండియా వే – స్ట్రాట‌జిస్ ప‌ర్ ఏ అన్స‌ర్టైన్ వ‌ర‌ల్డ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు.

Also Read : భార‌త్..అమెరికా సంబంధాలు బాగా లేవు

Leave A Reply

Your Email Id will not be published!