Bandi Sanjay CM KCR : కేసీఆర్ రాజీనామా చేసే దమ్ముందా
సవాల్ విసిరిన బీజేపీ స్టేట్ చీఫ్
Bandi Sanjay CM KCR : తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాజకీయాలు మరింత వేడెక్కాయి. నువ్వా నేనా అంటూ మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పాదయాత్రల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి ప్రతిపక్షాలు.
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వైపు బండి , ఇంకో వైపు వైఎస్ షర్మిల నువ్వా నేనా అంటూ ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ షాకింగ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కేవలం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం కోసమే ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్తగా కట్టారని , దానిని తాజ్ మహల్ లాగా చేశారంటూ మండిపడ్డారు.
తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, ఇక బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సెక్రటేరియట్ ను కూల్చి వేస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా ఆపే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
మరో వైపు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో కూల్చి వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఇద్దరిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. దీనిపై సీరియస్ గా స్పందించారు బండి సంజయ్(Bandi Sanjay). దమ్ముంటే కేసీఆర్ ముందు నీ పదవికి రాజీనామా చేయ్ అంటూ సవాల్ విసిరారు. సొల్లు కబుర్లతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. నువ్వు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలంటూ నిరూపిస్తానని అవి వాస్తవమని తేలితే రాజీనామా చేస్తావా అని మండిపడ్డారు.
Also Read : మోదీ మాటలు పచ్చి అబద్దాలు – ఆర్ఎస్పీ