Mamata Banerjee : ఆవులు దాడి చేస్తే ఆదుకుంటారా – దీదీ
కౌ హగ్ డే ప్రకటనపై షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee : టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును భిన్నంగా జరుపు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరు ఆవును హత్తు కోవాలని స్పష్టం చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కేంద్ర సర్కార్ పై, ప్రధాని మోదీపై మీమ్స్ , సెటైర్లు, కామెంట్స్ , ట్వీట్స్ పెద్ద ఎత్తున రావడంతో గత్యంతరం లేక కేంద్ర సర్కార్ దిగి వచ్చింది. తాను జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు , ప్రజాస్వామిక వాదులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సోమవారం కౌ హగ్ డే పై తీవ్రంగా స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆవులు అంటే ప్రతి ఒక్కరికీ ప్రేమ అనేది ఉంటుందన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ చెప్పినట్టు ఆవులను హత్తుకుంటే అవి దాడి చేస్తే ఎవురు ఆదుకుంటారని ప్రశ్నించారు. మరి కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని నిలదీశారు సీఎం దీదీ(Mamata Banerjee).
ప్రేమికుల రోజున ఆవును కౌగిలించు కోవాలని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను ఆమె ఎగతాళి చేశారు. జారీ చేయడం ఎందుకు..ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించు కోవాలని మండిపడ్డారు మమతా బెనర్జీ. ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు . ఇకనైనా పీఎం ప్రచార యావను తగ్గించుకుంటే మంచిదని సూచించారు సీఎం.
Also Read : పెట్టుబడులకు భారత్ గమ్యస్థానం – మోదీ