Cow Hug Day : ఇవాళ అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం. ఇదే సమయంలో కేంద్రంలో కొలువు తీరిన కాషాయ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రేమికుల రోజు కాకుండా గోవుల దినోత్సవంగా జరుపుకోవాలని. దీనిపై పెద్ద రాద్దాంతం జరగడంతో ఉన్నట్టుండి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఇది పక్కన పెడితే దేశంలోని జంతు ప్రేమికులంతా ఫిబ్రవరి 14న మంగళవారం పెద్ద ఎత్తున కౌ హగ్ డే లో మునిగి పోయారు. వాలంటైన్స్ డే వద్దు కౌ హగ్ డే(Cow Hug Day) ముద్దు అంటున్నారు.
ఎక్కడ చూసినా ఆవులను, దూడలను , గోమాతలను ఆలింగనం చేసుకుంటున్నారు. తమ ప్రేమను ఈ సందర్బంగా చాటుకుంటున్నారు. ఏ జంతువులైనా సరే ఒక్కసారి అలవాటైతే అవి మనతోనే ఉండి పోతాయి. వాటితో సహవాసం చేస్తే ఏమి చెప్పినా చేస్తాయి. ఈ దేశంలో గోవులకు ఉన్నంత ప్రాధాన్యత దేనికీ లేదు. ఎందుకంటే వాటిని దైవంగా భావిస్తారు. నిత్యం పూజలు కూడా చేస్తారు.
తాజాగా ప్రేమికుల రోజు ను కాకుండా చాలా చోట్ల ఆవులను ఆలింగనం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. అయితే తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని కానీ ఇదే సమయంలో దేశ సంపదలో భాగంగా , వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న గోవుల (ఆవులు)ను కాపాడుకోవడం మనందరి కర్తవ్యమంటున్నారు గో రక్షకులు..సంరక్షకులు.
మనుషులు, జంతువుల మధ్య అనుబంధాన్ని పెంచుకునేందుకు, ప్రకృతితో మమేకం అయ్యేందుకు కౌ హగ్ డేను(Cow Hug Day) పాటిస్తున్నారు. అంతే కాదు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా విడుదలవుతుందని పేర్కొంటున్నారు.
Also Read : గీత’ మానవత్వాన్ని నేర్పే గ్రంథం
