Joe Biden Tesla : ఎలోన్ మ‌స్క్ కు జో బైడెన్ కితాబు

టెస్లా ఛార్జింగ్ నెట్ వ‌ర్క్ కు శ్రీ‌కారం

Joe Biden Tesla : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. టెస్లా కు సంబంధించి ఛార్జింగ్ నెట్ వ‌ర్క్ ను త్వ‌ర‌లోనే అమెరికాలో విస్త‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎలోన్ మ‌స్క్. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము స్వీక‌రిస్తున్నామ‌ని, స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు యుఎస్ చీఫ్‌(Joe Biden Tesla). 2024 నాటికి టెస్లా 7,500 కొత్త‌, ఇప్ప‌టికే ఉన్న సూప‌ర్ చార్ట‌ర్్ లు , డెస్టినేష‌న్ ఛార్ట‌ర్ ల‌ను ప్రారంభిస్తుంద‌ని బైడెన్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా త‌న విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ నెట్ వ‌ర్క్ లో కొంత భాగాన్ని తెరిచేందుకు టెస్లా ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మ‌స్క్ భారీ ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్ర‌ణాళిక గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు అమెరికా ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్(Joe Biden Tesla). ఈ చ‌ర్య పెద్ద ఒప్పందానికి, మార్పును తీసుకు వ‌చ్చలా చేస్తుంద‌న్నారు.

గ‌తంలో ఎలోన్ మ‌స్క్ తీరు ప‌ట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు యుఎస్ చీఫ్‌. ఈ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా టెస్లా చైర్మ‌న్ గురించి సానుకూలంగా స్పందించడం, ఆ మేర‌కు ట్వీట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

ఇదే స‌మ‌యంలో ఈవీ ఛార్జింగ్ నెట్ వ‌ర్క్ ను నిర్మించ‌డంలో , వీలైన‌న్ని ఎక్కువ మంది డ్రైవ‌ర్ల‌కు ఎక్కువ ఛార్జ‌ర్ లు ప‌ని చేసేలా చూసుకోవాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. కాగా జోసెఫ్ బైడెన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చారు ఎలోన్ మ‌స్క్. స్పందించినందుకు ధ‌న్యావాదాలు. టెస్లా మా సూప‌ర్ చార్జ‌ర్ నెట్ వ‌ర్క్ ద్వారా ఇత‌ర ఈవీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

Also Read : 840 ఫ్లైట్స్ కు ఎయిర్ ఇండియా ఆర్డ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!