Jitan Ram Manjhi : తేజస్వి కంటే నా కొడుక్కి ఏం తక్కువ
సీఎం, డిప్యూటీ సీఎంలపై ఆగ్రహం
Jitan Ram Manjhi : బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లపై జితిన్ రామ్ మాంఝీ నిప్పులు చెరిగాడు. సంపర్క్ యాత్రలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నితీష్ , తేజస్విలను టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాలలో చర్చకు దారి తీసింది.
జితిన్ రామ్ మాంఝీ ఈ రోజుల్లో గరీబ్ సంపర్క్ యాత్రలో ఉన్నారు. మహా ఘట్ బంధన్ అసలైన వారసుడిగా తేజస్వి యాదవ్ ను పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జితిన్ రామ్ మాంఝీ. తన కొడుకు సంతోష్ కుమార్ సుమన్ శాసన మండలి సభ్యుడు , బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నాడు.
అతను చదవగలడు..రాయగలడు..తనకొడుక్కి కూడా సీఎం అయ్యే అర్హత ఉందని అన్నారు జితిన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi).
హిందుస్థానీ అవామ్ మోర్చా వ్యవస్థాపకుడు అయిన జితిన్ రామ్ మాంఝీ ప్రస్తుతం గరీబ్ సంపర్క్ యాత్రలో బిజీగా ఉన్నారు. ప్రధానంగా నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్ లను తరచుగా లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఫ్యాక్షనిజంతో దెబ్బతిన్న మహా కూటమి గురించిన ప్రశ్నలను లేవనెత్తింది.
ఇదిలా ఉండగా జితిన్ మాంఝీ నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వ పని తీరును ప్రశ్నించారు. జితిన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi) జెహనాబాద్ లో మీడియా తో మాట్లాడారు. తన కుమారుడిని బీహార్ సీఎం చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా జవాబు ఇచ్చాడు. తన కొడుకు ఏం తక్కువని , అతడిని బీహార్ సీఎం అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నారు.
Also Read : వచ్చే ఎన్నికలపై చెప్పలేను – థరూర్