PM Modi : తృణ ధాన్యాలతో ఆహార భద్రత – మోదీ
సవాళ్లను అధిగమించేందుకు దోహదం
PM Modi Global Millets : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత సవాళ్లను అధిగమించేందుకు తృణ ధాన్యాలు సహాయ పడతాయని అన్నారు. గ్లోబల్ మిల్లెట్స్ సదస్సును శనివారం ప్రధానమంత్రి ప్రారంభించారు. భారత దేశం చేసిన ప్రతిపాదన, కృషి వల్ల ఇవాళ ఐక్య రాజ్య సమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం దేశానికి గర్వ కారణమని అన్నారు నరేంద్ర మోదీ.
ఆహార భద్రత పరంగా ఎదురయ్యే సవాళ్లను తృణ ధాన్యాల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోనే సామర్థ్యం వీటి ద్వారా కలుగుతుందన్నారు. తృణ ధాన్యాలాను లేదీ శ్రీ అన్నను ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమంగా ప్రోత్సహించేందుకు తమ దేశం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు నరేంద్ర మోదీ.
ఆహార భద్రతతో పాటు ఆహారపు అలవాట్ల సవాళ్లను దాటేందుకు మినుములు దోహద పడతాయని ప్రధానమంత్రి చెపపారు. జాతీయ ఆహార పరంగా పోషక తృణ ధాన్యాల వాటాను పెంచేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధానమంత్రి(PM Modi Global Millets) కోరారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులలో , రసాయనాలు , ఎరువులు లేకుండా మినుములను సులభంగా పండించ వచ్చని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. దేశంలోని 2.5 కోట్ల చిన్న, సన్న కారు రైతులకు ప్రయోజనం దీని వల్ల ప్రయోజనం చేకూరుతోందన్నారు.
పుడ్ ప్రాసెసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు ప్రధానమంత్రి. మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తిని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీలను కోరారు. దీని వల్ల రైతులకు సబ్సిడీ కూడా అందజేస్తున్నామని తెలిపారు పీఎం.
Also Read : మోదీకి విందు ఇవ్వనున్న బైడెన్