RS Praveen kumar : క్ష‌మాప‌ణ చెప్పండి రాజీనామా చేయండి

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీల వ్య‌వ‌హారంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిన్న‌టి దాకా తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో పేప‌ర్ లీక్ ఘ‌ట‌న మ‌రిచి పోక ముందే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రాస్తున్న‌10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి ప్ర‌శ్నా ప‌త్రాలు లీక్ కావ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర మంత‌టా ప‌రీక్ష‌లు ప్రారంభం కాగా సోమ‌వారం వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ త‌ర‌గ‌తి తొలి పేప‌ర్ తెలుగు ప్ర‌శ్నా ప‌త్రం వాట్సాప్ లో లీక్ అయ్యింది. దీనిని మొద‌ట‌గా డిఇఓ రేణుకా దేవి ఖండించింది. కానీ అది పెద్ద ఎత్తున స‌ర్కులేట్ కావ‌డంతో గ‌త్యంత‌రం లేక ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి సూప‌రింటెండెంట్ , ఇన్విజిలేట‌ర్ , టీచ‌ర్ ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజాగా మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ జిల్లాలో 10వ త‌ర‌గ‌తి హిందీ ప్ర‌శ్నా ప‌త్రం లీక్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ పేప‌ర్ కూడా వాట్సాప్ లో చ‌క్క‌ర్లు కొట్ట‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) . క‌నీసం 10వ త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌ను కూడా కంట్రోల్ చేయ‌లేని స్థితిలో ఉన్న విద్యా శాఖ మంత్రి వెంట‌నే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

Also Read : కేసీఆర్ కు అంత డ‌బ్బు ఎక్క‌డిది

Leave A Reply

Your Email Id will not be published!