Manish Sisodia : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఏప్రిల్ 17 వరకు కస్టడీలోనే మాజీ డిప్యూటీ సీఎం
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన ఆప్ అగ్ర నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. విచారణకు సంబంధించి ఆయన కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగించింది కోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 34 మందిపై అభియోగాలు మోపింది. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ప్రధానంగా రామచంద్ర పిళ్లై తో పాటు సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను కూడా మూడుసార్లు ఈడీ విచారించింది. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు.
మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఈడీ రంగంలోకి దిగింది. సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఇదే సమయంలో తనకు ఏమీ తెలియదని సిసోడియా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దర్యాప్తు కీలక దశలో ఉందని ఈడీ కోరడంతో మనీష్ సిసోడియాకు(Manish Sisodia) సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది.
ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. నేరానికి సంబంధించినంత వరకు ఎలాంటి ఆధారాలు లేవని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది జైన్ కోర్టుకు విన్నవించారు. అన్ని లాకర్లు తెరిచారని, ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రూఫ్ లభించ లేదని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇదంతా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. సిసోడియా(Manish Sisodia) ఖాతాలో కానీ ఆయన కుటుంబానికి చెందిన వారి ఖాతాల్లో ఒక్క పైసా బయటి నుంచి రాలేదని పేర్కొన్నారు.
Also Read : ఏ1గా బండి సంజయ్ – సీపీ
