Taiwan President : ప్ర‌జాస్వామ్యానికి ర‌క్ష‌ణ క‌రువు

తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్

Taiwan President : తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ వైపు తైవాన్ కు ముప్పులా ప‌రిణ‌మించింది చైనా. ప్ర‌మాదపు టంచుల్లో ఉన్న తైవాన్ కు అమెరికా అండ‌గా నిలిచింది. ఈ త‌రుణంలో తైవాన్ ప్రెసిడెంట్(Taiwan President) గురువారం అమెరికాలోని కాలిఫోర్నియాలోని యుఎస్ హౌస్ స్పీక‌ర్ కెవిన్ మెక్ కార్తీతో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా సాయ్ ఇంగ్ వెన్ కీల‌క ప్ర‌సంగం చేశారు.

ఇవాళ మ‌నం కాపాడుకున్న శాంతి, మ‌నం క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న ప్ర‌జాస్వామ్యం అపూర్వ‌మైన రీతిలో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని ఇది ఎంత మాత్రం ర‌హ‌స్యం కానే కాద‌న్నారు సాయ్ ఇంగ్ వెన్. ఇదే స‌మ‌యంలో క‌ష్ట కాలంలో అమెరికా తైవాన్ ప‌క్క‌న ఉన్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా తాను కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేస్తున్నాన‌ని ప్రెసిడెంట్(Taiwan President) చెప్పారు.

అంత‌ర్జాతీయ వేదిక‌పై త‌న ద్వీపం ఒంట‌రిగా లేద‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికాలో త‌న‌కు ఇరు వైపులా ఉన్న రాజ‌కీయ నాయ‌కుల నుంచి ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం సంతోషం క‌లిగించింద‌న్నారు.

స‌మావేశం అనంత‌రం సిమి వ్యాలీలోని రోనాల్డ్ రీగ‌న్ ప్రెసిడెన్షియ‌ల్ లైబ్ర‌రీలో ఆమె మీడియాతో మాట్లాడారు. మేం ఒంట‌రిగా లేమ‌ని యావ‌త్ ప్ర‌పంచం గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Also Read : చ‌దువు బ‌తుకును వెలిగిస్తుంది – ఇమ్నా

Leave A Reply

Your Email Id will not be published!