Amit Shah UP Tour : రూ. 4,567 కోట్ల పనులకు షా శ్రీకారం
ప్రారంభించనున్న కేంద్ర హొం శాఖ మంత్రి
Amit Shah UP Tour : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో(Amit Shah UP Tour) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ. 4,567 కట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులు, సంగీత కాలేజీని ప్రారంభించనున్నారు. అమిత్ షా తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ యూపీలోని అజంగఢ్ లోని హరిహర్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ హోం శాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేస్తారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి కౌశాంబి ఫెస్టివల్ 2023ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం యూపీలోని కౌశంబి జిల్లాలోని ఫసయ్య గ్రామసభలో పాల్గొంటారు అమిత్ షా. హరిహర్ పూర్ సంగీత మహా విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం యూపీలోని నమ్ దర్ పూర్ ప్రాంతంలో రూ. 4,567 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు అమిత్ చంద్ర షా(Amit Shah).
ఇదిలా ఉండగా గత ఏడాది ఆగష్టులో యోగి ఆదిత్యానాథ్ గ్రామాన్ని సందర్శించినప్పుడు లక్నోలోని భత్ ఖండే విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఒక సంగీత కళాశాలను గ్రామంలో ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ మేరకు శుక్రవారం అది నెరవేరబోతోంది. అజంగఢ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిహర్ పూర్ ఊరు శతాబ్దాల నాటి సంగీత వారసత్వానికి ప్రసిద్ది చెందింది.
Also Read : కాంగ్రెస్ హయాంలోనే అదానీకి పెద్దపీట