Assam CM Rahul : రాహుల్ కామెంట్స్ హిమంత సీరియస్
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా
Assam CM Rahul : కాంగ్రెస్ అగ్ర నేతపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశం పట్ల గౌరవం లేని వ్యక్తి నాయకుడిగా ఉండడం ప్రజలకు శాపంగా మారిందన్నారు. అభివృద్ది పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా అపోహలు కలిగించేలా వ్యాఖ్యలు చేస్తూ దేశ పరువును దిగజారుస్తున్నారంటూ మండిపడ్డారు. శనివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీపై.
కేంద్రంలోని సర్కార్ ను, తమ పార్టీని పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎవరి హయాంలో దేశం దిగజారిందో మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ని తిట్లు తిట్టినా లేదా ఆరోపణలు చేసినా వచ్చేది రాబోయే కాలంలో తామేనని స్పష్టం చేశారు హిమంత బిస్వా శర్మ(Assam CM Rahul) .
బోఫోర్స్ స్కాం, నేషనల్ హెరాల్డ్ స్కాంల గురించి ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. తాము ఇప్పటి వరకు మౌనంగా ఉన్నామని కానీ తమ శ్రేణులు ఎదురు తిరిగితే కాంగ్రెస్ తట్టుకోవడం కష్టమన్నారు. త్వరలో జరిగే కర్ణాటకలో సైతం తామే పవర్ లోకి వస్తామన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఐసీయూలో ఉందని దానికి ఇంకా చికిత్స ఇవ్వాల్సింది ప్రజలేనని ఎద్దేవా చేశారు అస్సాం సీఎం.
Also Read : కర్ణాటకలో రాబోయే కాలం మాదే