PM Modi Josh : భాగ్య న‌గ‌రం మోదీకి బ్ర‌హ్మ‌ర‌థం

హైద‌రాబాద్ టూర్ స‌క్సెస్

PM Modi Josh : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప‌లు అభివృద్ది ప‌నులకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 11,000 కోట్ల‌కు పైగా ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అంత‌కు ముందు న‌రేంద్ర మోదీకి(PM Modi Josh) జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్ర‌ధాన‌మంత్రి ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు, అభిమానుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రికీ చేయి ఊపుతో విషెష్ చెప్పారు.

అంత‌కు ముందు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి నిప్పులు చెరిగారు. విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు. ప‌నిలో ప‌నిగా రాష్ట్ర స‌ర్కార్ పై, సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు తాము మేలు చేయాల‌ని చూస్తుంటే బీఆర్ఎస్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు. ఇలాంటి చ‌వ‌క‌బారు ఎత్తులు వేయొద్ద‌ని సూచించారు.

ఏదైనా ఉంటే త‌న‌తో ఢీకోవాల‌ని కానీ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించ‌వ‌ద్ద‌ని సూచించారు. ప‌నిలో ప‌నిగా అవినీతి, అక్ర‌మాల‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం కేరాఫ్ గా మారి పోయింద‌ని ఆరోపించారు. స‌ద‌రు కుటుంబంపై చ‌ర్య‌లు తీసుకోవాలా వ‌ద్దా మీరే చెప్పాల‌ని స‌భ‌కు హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అడిగారు. దీంతో ప‌రోక్షంగా కేసీఆర్ ను హెచ్చ‌రించిన‌ట్ల‌యింది. దీని వెనుక ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Also Read : కోర్టు షాక్ ఇచ్చినా మార‌క పోతే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!