Anil K Antony Rahul : రాహుల్ గాంధీపై ఆంటోనీ ఆగ్రహం
మరీ ఇంత దిగజారుతారని అనుకోలేదు
Anil K Antony Rahul : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు ఏకే ఆంటోనీ తనయుడు తాజాగా బీజేపీలో చేరిన అనిల్ కె ఆంటోనీ. తనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ నాయకులను లక్ష్యంగా చేసుకుని సంచలన కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. ఆయన చేసిన ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు అనిల్ కె ఆంటోనీ(Anil K Antony Rahul). రాహుల్ గాంధీ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ట్వీట్లకు, ఆరోపణలు మాత్రమే సరిపోతే ఎలా అని ప్రశ్నించారు.
దేశం పట్ల ఇంకా అవగాహన పెంచు కోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. వ్యక్తులను టార్గెట్ చేస్తూ , వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప తమకు కాదన్నారు. పొద్దస్తమానం అదానీని పదే పదే అనడం వల్ల ఆయనకు ప్రచారం జరుగుతోందే తప్పా ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు అనిల్ కె ఆంటోనీ.
తాజాగా రాహుల్ గాంధీ అదానీతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ , జ్యోతిరాదిత్యా సింధియా, అనిల్ కె ఆంటోనీతో సహా పలువురి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నీతి లేదని, పదవుల కోసం పార్టీని వీడారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. దీనిపై సీరియస్ గా తీసుకున్న అనిల్ కె ఆంటోనీ(Anil K Antony) తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మారాల్సింది పార్టీతో పాటు మీరు కూడా అంటూ ఎద్దేవా చేశారు.
Also Read : కోర్టు షాక్ ఇచ్చినా మారక పోతే ఎలా