RR vs SRH IPL 2023 : హైద్రాబాద్ భ‌ళా రాజ‌స్థాన్ బోల్తా

చివ‌రి బంతికి మ్యాజిక్ చేసిన ఎస్ఆర్ హెచ్

RR vs SRH IPL 2023 : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజ‌స్థాన్ లోని జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR vs SRH IPL 2023) నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 214 ర‌న్స్ చేసింది. జైశ్వాల్ 35 ర‌న్స్ చేస్తే , జోస్ బ‌ట్ల‌ర్ 95 ప‌రుగుల‌తో సెంచ‌రీ మిస్ అయ్యాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ 66 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం 215 ప‌రుగుల భారీ స్కోర్ టార్టెట్ తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ స‌మిష్టిగా రాణించింది. చివ‌రి బంతి ఆఖ‌రున వ‌చ్చిన అబ్దుల్ స‌మ‌ద్ 2 సిక్స్ ల‌తో హోరెత్తించాడు. జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొన‌సాగింది. ఆఖ‌రి బంతికి 4 ర‌న్స్ కావాల్సి ఉండ‌గా స‌మ‌ద్ సిక్స్ కొట్ట‌డంతో హైద‌రాబాద్ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు అందుకుంది.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో(RR vs SRH IPL 2023) అన్మోల్ ప్రీత్ సింగ్ 4 పోర్లు 1 సిక్స‌ర్ తో 33 ర‌న్స్ చేశాడు. అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ తో రాణించాడు. 55 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. రాహుల్ త్రిపాఠి 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 47 ర‌న్స్ తో దంచి కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ 26 ప‌రుగులు చేస్తే..ఐడెన్ మార్క్రామ్ 6 ర‌న్స్ కే వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 1 ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 25 ప‌రుగుల‌తో దంచి కొట్టాడు.

Also Read : జోస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీ మిస్

Leave A Reply

Your Email Id will not be published!