MS Dhoni Karthiki Gonsalves : మిస్ట‌ర్ కూల్ వెరీ స్పెష‌ల్

ది ఎలిఫెంట్ విష్ప‌ర‌ర్స్ డైరెక్ట‌ర్ కి కితాబు

జార్ఖండ్ డైన‌మెట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మైదానం లోప‌టే కాదు వెలుప‌ల కూడా చాలా కూల్ గా ఉంటాడు. అంతే కాదు టాలెంట్ ను గుర్తించ‌డం, ప్రోత్స‌హించ‌డం అవ‌స‌ర‌మైతే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంలో త‌ను ముందుంటాడు. అందుకే చాలా మంది యువ , వ‌ర్ధ‌మాన ఆట‌గాళ్లు ధోనీని త‌మ ప్ర‌త్య‌క్ష దైవంగా భావిస్తారు. అంత‌లా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు కూడా. సార‌థి ఎలా ఉండాలో ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో త‌న‌కు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దు.

తాజాగా మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాడు మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. ఢిల్లీతో మ్యాచ్ సంద‌ర్బంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఆస్కార్ అవార్డుతో కోట్లాది హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది ది ఎలిఫెంట్ విష్ప‌ర‌ర్స్ చిత్రం. దానికి ద‌ర్శ‌కురాలు కార్తీకి గోన్సాల్వేస్. ఇందులో న‌టించి మెప్పించ‌డ‌మే కాదు క‌న్నీళ్లు తెప్పించిన సంర‌క్ష‌కులు బొమ్మ‌న్ , బెల్లీల‌ను కూడా చెన్నై లోని చిదంబ‌రం స్టేడియంలో ఘ‌నంగా స‌న్మానం చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం. వారికి బ‌హుమానంగా మెమెంటోల‌తో పాటు కొంత న‌గ‌దు అంద‌జేసింది.

ఈ సంద‌ర్బంగా మ‌హేంద్ర సింగ్ ధోనీ బొమ్మ‌న్ , బెల్లీ, గోన్సాల్వేస్ ను స‌న్మానించాడు. ఆపై తాను ఇష్టంగా ధ‌రించే 7వ నెంబ‌ర్ జెర్సీని వారికి అంద‌జేశాడు. అంతే కాదు అద్భుత‌మైన చిత్రాన్ని అంద‌జేసినందుకు, జంతువుల ప‌ట్ల ప్రేమ‌ను క‌లిగి ఉండాల‌ని చెప్పినందుకు ద‌ర్శ‌కురాలు కార్తీకి గోన్సాల్వేస్ ను ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

Leave A Reply

Your Email Id will not be published!