KKR vs RR IPL 2023 : రాజ‌స్థాన్ కోల్ క‌తా బిగ్ ఫైట్

స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరుకు ఇరు జ‌ట్లు రెడీ

ప్లే ఆఫ్ రేస్ కు చేరుకోవాలంటే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల‌కు. మొన్న‌టి దాకా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ 4లో చోటు సంపాదించుకున్న శాంస‌న్ సేన ఉన్న‌ట్టుండి పేల‌వ‌మైన ఆట‌తీరుతో నిరాశ ప‌రిచింది. జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ చేతిలో చివ‌రి బంతికి బోల్తా ప‌డింది. స‌మ‌ద్ కొట్టిన దెబ్బ‌కు రాజ‌స్థాన్ ఓట‌మి పాలైంది.

ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బ‌లంగా ఉంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ప్ర‌ధానంగా ఇవాళ జ‌రిగే మ్యాచ్ త‌మ స్వంత గ్రౌండ్ కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌ర‌గ‌నుంది. ఇది ఆ జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ లైనప్ లో బ‌లంగా క‌నిపిస్తున్నా ఆశించిన మేర రాణించ‌డం లేదు. అస‌లైన స‌మ‌యంలో పూర్తిగా చేతులెత్తేస్తోంది.

ప్లే ఆఫ్ రేసు లో నిల‌వాలంటే విధిగా గెల‌వాల్సిందే. దీంతో ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జ‌ర‌గ‌డం ఖాయం. ఇక ఈ టోర్నీలో ఇది 56వ మ్యాచ్. ఇరు జ‌ట్లు 11 మ్యాచ్ లు ఆడాయి. 5 మ్యాచ్ ల‌లో గెలుపొందాయి. 6 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాల‌య్యాయి.

Leave A Reply

Your Email Id will not be published!