Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్
13 బంతుల్లోనే 50 రన్స్ చేసిన క్రికెటర్
కోల్ కతా వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కోల్ కతాపై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
యశస్వి జైస్వాల్ అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొని అరుదైన ఘనత సాధించాడు. జైస్వాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే.
గతంలో ఐపీఎల్ హిస్టరీలో కేఎల్ రాహుల్ , పాట్ కమిన్స్ సంయుక్తంగా నెలకొల్పిన రికార్డ్ ను బద్దలు చేశాడు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా ఊహించని రీతిలో తను బౌలింగ్ కు వచ్చాడు. కానీ బోల్తా పడ్డాడు.
వచ్చీ రావడంతోనే దంచి కొట్టాడు యశస్వి జైస్వాల్. మూడు ఫోర్లు 4 సిక్సర్లు, 2 రన్స్ చేశాడు. తొలి ఓవర్ లోనే 26 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ లో ఒక ఫోర్ , సిక్సర్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్ లో జైశ్వాల్ మళ్లీ రెచ్చి పోయాడు. 3 ఫోర్లు కొట్టాడు. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
