Shimron Hetmyer Catch : షిమ్రాన్ హెట్మెయర్ స్టన్నింగ్ క్యాచ్
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో జేసన్ కు షాక్
కోల్ కతా వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 13 ఓవర్లలోనే పని పూర్తి కానిచ్చేసింది. జైశ్వాల్ రెచ్చి పోతే శాంసన్ దంచి కొట్టాడు. ఇద్దరూ కలిసి 121 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి 98 రన్స్ చేస్తే సంజూ 47 చేశాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ జేసన్ రాయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అద్భుతమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్ దాటితే సిక్స్ వస్తుంది. కానీ విండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హిట్మెయర్ ఊహించని రీతిలో కళ్లు చెదిరేలా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అద్భుతమైన క్యాచ్ లలో ఇది ఒకటిగా పేర్కొంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే హెట్మయర్ తీసుకున్న ఆ క్యాచ్ వైరల్ గా మారింది. ఫోటోలు వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
మరో వైపు సందీప్ శర్మ సైతం కళ్లు తెరిచే లోపే అద్భతుమైన క్యాచ్ పట్టుకుని ఔరా అనిపించేలా చేశాడు. మొత్తగా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ పరంగా టాప్ లో నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లకు బౌలర్లు చుక్కలు చూపించారు. యుజ్వేంద్ర చాహల్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు.
