ఐపీఎల్ సీజన్ లో టాప్ బౌలర్ రేసులో గుజరాత్ టైటాన్స్ కు చెందిన రషీద్ ఖాన్ రాజస్థాన్ రాయల్స్ తరపున యుజ్వేంద్ర చాహల్ మధ్య నువ్వా నేనా పోరు నడిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ లో ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఇంకా మ్యాచ్ లు కొనసాగనున్నాయి. యుజ్వేంద్ర చాహల్ ఇంకొన్ని వికెట్లు తీసే అవకాశం ఎక్కువగా ఉంది.
ప్రస్తుతానికి రషీద్ ఖాన్ , చాహల్ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలవనున్నారు. ఇదిలా ఉండగా రషీద్ ఖాన్ , యుజ్వేంద్ర చాహల్ తో పాటు పీయూష్ చావ్లా, మహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు రేసులో నిలిచారు. ఆయా బౌలర్లతో పాటు మొత్తం 20 మంది బౌలర్లు ఐపీఎల్ లో తమ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు. చాహల్ 187 వికెట్లు తీశాడు. విండీస్ కు చెందిన డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీస్తే 161 మ్యాచ్ లు ఆడాడు.
పీయూష్ చావ్లా 185, ఆ తర్వాత అమిత్ మిశ్రా, రాజస్తాన్ తరపున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ , లసిత్ మలింగ 170 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ 160కి పైగా వికెట్లు తీశాడు. విండీస్ కు చెందిన సునీల్ సరైన్ , హర్బజన్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా , ఉమేష్ యాదవ్ , రవీంద్ర జడేజా , సదీప్ శర్మ, ఆశిష్ నెహ్రా, వినయ్ కుమార్ , అక్షర్ పటేల్ , జహీర్ ఖాన్ , మహ్మద్ షమీ, కగిసో రబడా వికెట్లు తీసి జాబితాలో నిలిచారు.
