DC vs PBKS IPL 2023 : ఢిల్లీ గెలుస్తుందా పంజాబ్ నిలుస్తుందా

క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ కింగ్స్ బిగ్ ఫైట్

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా శ‌నివారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఢిల్లీ వేదిక‌గా కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ , శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్లు కీల‌క పోరుకు రెడీ అయ్యాయి.

పాయింట్ల ప‌ట్టిక‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆఖ‌రు స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. 7 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. 10వ స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ విష‌యానికి వ‌స్తే ఆ జ‌ట్టు 8వ స్థానంలో కొన‌సాగుతోంది. ఈ జ‌ట్టు కూడా 11 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ ల‌లో గెలుపొంద‌గా 6 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కు డేవిడ్ వార్న‌ర్ కెప్టెన్ కాగా ఫిలిప్ సాల్ట్ , మిచెల్ మార్ష్ , మ‌నీష్ పాండే , రిలీ రౌసా, అక్ష‌ర్ ప‌టేల్ , అమ‌న్ ఖాన్ , కుల్దీప్ యాద‌వ్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , ఇషాంత్ శ‌ర్మ‌, ల‌లిత్ యాద‌వ్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్లలో ఖ‌లీల్ అహ్మ‌ద్ , అమ‌న్ హ‌కీమ్ ఖాన్ , రిపాల్ ప‌టేల్ , ల‌లిత్ యాద‌వ్ ప్ర‌త్యామ్నాయం కానున్నారు. వీరితో పాటు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , ముఖేష్ కుమార్ , ల‌లిత్ యాద‌వ్ , అభిషేక్ పోరెల్ , అన్రిచ్ , ప్ర‌వీణ్ దూబే , రిపాల్ ప‌టేల్ , లుంగీ ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహ‌మాన్ , రోవ్ మ‌న్ పాల్ , పృథ్వీ షా , చేత‌న్ స‌కారియా , య‌శ్ ధుల్ , వికీ ఓస్త్వాల్ ఉన్నారు.

ఇక పంజాబ్ కింగ్స్ ప‌రంగా చూస్తే శిఖ‌ర్ ధావ‌న్ కెప్టెన్ కాగా , లివింగ్ స్టోన్ , సికంద‌ర్ రాజా, సామ్ క‌ర‌న్ , జితేశ్ శ‌ర్మ , షారుక్ ఖాన్ , హ‌ర్ ప్రీత్ బ్రార్ , నాథ‌న్ ఎల్లిస్ , రాహుల్ చాహ‌ర్ , అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్లుగా ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ , అథ‌ర్వ తైదే ఉండ‌గా ప్ర‌త్యామ్నాయంగా చూస్తే మాథ్యూ షార్ట్ , రిషి ధావ‌న్ , మోహిత్ రాథీ, శివ‌మ్ సింగ్ , భానుక రాజ‌ప‌క్సే, బ‌ల్లేజ్ సింగ్ ఆడ‌నున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!