DC vs PBKS IPL 2023 : పంజాబ్ దెబ్బ‌కు ఢిల్లీ విల‌విల

ప్ర‌భ్ సిమ్ర‌న్ సెంచ‌రీతో సూప‌ర్

ఐపీఎల్ 16వ సీజ‌న్ ప్లే ఆఫ్ రేసు నుంచి డేవిడ్ వార్న‌ర్ సేన నిష్క్ర‌మించింది. ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌రోసారి నిరాశ ప‌రిచింది. పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు ప్ర‌భ్ సిమ్ర‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దీంతో జ‌ట్టు సునాయాసంగా గెలుపు సాధించింది. ఈ విక్ట‌రీతో పంజాబ్ కింగ్స్ ఆరో విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో అదుర్స్ అనిపించింది.

ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు యువ క్రికెట‌ర్ ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ . కేవ‌లం 65 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 103 ర‌న్స్ చేశాడు. 31 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఓడించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పంజాబ్ కింగ్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 167 ర‌న్స్ చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌క్కువ స్కోర్. కానీ ఆ స్కోర్ ను ఛేదించ‌లేక చ‌తికిల ప‌డింది. ప్ర‌భ్ సిమ్ర‌న్ ఒంట‌రి పోరాటం చేశాడు. సిమ్ర‌న్ ఒక్క‌డే బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ బౌల‌ర్లు అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేసినా ఫ‌లితం లేక పోయింది.

కెప్ట‌న్ శిఖ‌ర్ ధావ‌న్ 7 ర‌న్స్ కే వెనుదిర‌గగా లివింగ్ స్టోన్ 4 , జితేశ్ శ‌ర్మ 5 , షారుఖ్ ఖాన్ 2 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచారు. ఇషాంత్ శ‌ర్మ 2 వికెట్లు తీశాడు . అనంత‌రం 168 స్వ‌ల్ప ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 18.5 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 130 ర‌న్స్ చేసింది.

కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ అద్భుతంగా ఆడాడు. 27 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో రెచ్చి పోయాడు. ఫిల్ సాల్ట్ 21 ర‌న్స్ చేశాడు. ఒక ద‌శ‌లో ప‌టిష్టంగా క‌నిపించింది. కానీ ఎప్పుడైతే పంజాబ్ బౌల‌ర్ హ‌ర్ ప్రీత్ బార్ బౌలింగ్ కు వ‌చ్చాడో సీన్ మారింది. కేవ‌లం 30 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. రాహుల్ చాహ‌ర్ 2 వికెట్లు తీశాడు. వార్న‌ర్, సాల్ట్ వెనుదిరిగాక ఏ ఒక్క బ్యాట‌ర్ ఆడ‌లేదు. మార్ష్ 3, రాసో 5, పాండే సున్నాకే వెనుదిరిగారు.

Leave A Reply

Your Email Id will not be published!