Priyanka Chopra : ఆర్ఆర్ఆర్ మూవీ చూడ‌లేదు

ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రా

ప్ర‌ముఖ భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ చూడ‌లేద‌న్నారు. ఆ విష‌యాన్ని ఒప్పుకున్నారు. ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్ కంటే ఎక్కువ‌గా హాలీవుడ్ లో న‌టిస్తోంది. లాస్ ఏంజెల్స్ వెళ్లి హాలీవుడ్ లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రియాంక చోప్రా టాప్ న‌టీమణుల్లో ఒక‌రు.

బాలీవుడ్ నుంచి దీపికా ప‌దుకొనే కూడా వెళ్లారు. ఇక అమెరికాలో ఆర్ఆర్ఆర్ ప్రీమియ‌ర్ ను ప్రియాంక చోప్రా హోస్ట్ చేసింది. అంతే కాదు త‌న నివాసంలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కొణిదెల‌కు ఆతిథ్యం కూడా ఇచ్చింది.

ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఉత్త‌మ ఒరిజ‌న‌ల్ సాంగ్ విభాగంలో. దీనిని చంద్ర‌బోస్ రాస్తే ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. కాల భైర‌వ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అయితే ఈ చిత్రం గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఇంకా తాను చూడ‌లేదంటూ నిజం ఒప్పుకుంది.

త‌న‌కు ఇంకా స‌మ‌యం దొర‌క‌లేద‌ని, సినిమాలు ఎక్కువ‌గా చూడ‌న‌ని చెప్పింది. టీవీ షోలు ఎక్కువ‌గా చూస్తాను. దుబాయ్ బ్లింగ్ ను చూశా..కానీ నేను టార్ ని చూడ‌లేనంటూ పేర్కొంది ప్రియాంక చోప్రా. జంజీర్ లో రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించింది ప్రియాంక చోప్రా.

Leave A Reply

Your Email Id will not be published!