LSG vs MI IPL 2023 : రసవత్తర పోరులో లక్నోదే విజయం
5 పరుగుల తేడాతో ముంబై ఓటమి
LSG vs MI IPL 2023 : లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 రన్స్ చేసింది. మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 87 రన్స్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఊచ కోత కోశాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా 49 రన్స్ తో కీలకమైన పరుగులు చేశాడు. ఓ దశలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత పాండ్యా, స్టోయినిస్ కలిసి స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
అనంతరం 178 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ గెలుపు అంచుల దాకా వచ్చి బోర్లా పడింది. 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పడి పోయింది ముంబై ఇండియన్స్. ఈ విజయంతో 3వ స్థానానికి చేరుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 1 వికెట్ తీస్తే బెహ్రాండర్స్ 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు ఎవరూ సత్తా చాటలేక పోయారు.
ముంబై జట్టులో రోహిత్ శర్మ 37 రన్స్ చేస్తే ఇషాన్ కిషన్ 59 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 7 , వధేరా 16 పరుగులతో నిరాశ పరిచారు. చివరలో టిమ్ డేవిడ్ 32 రన్స్ చేసినా ఫలితం లేక పోయింది. 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.
Also Read : CM Post Dilemma Comment
