Amazon Invest : అమెజాన్ $12.7 బిలియ‌న్ల పెట్టుబ‌డి

క్లౌడ్ సేవ‌ల స‌ర్వీసులో భారీ మొత్తం

Amazon Invest : అమెజాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశంలో క్లౌడ్ కు సంబంధించిన మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించి భారీగా పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు $12.7 బిలియ‌న్ పెట్టుబ‌డి పెట్ట‌నుంది. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఇండియాలో క్లౌడ్ కు సంబంధించి రూ. 1,05,600 కోట్లు పెట్టుబ‌డి పెట్టాల‌ని యోచిస్తోంద‌ని ప్ర‌క‌టించింది. దేశంలో దీర్ఘకాలిక కాలంలో 2030 నాటికి రూ. 1,46,500 కోట్ల‌కు చేరుతుంద‌ని పేర్కొంది.

త‌మ పెట్టుబ‌డులు స్థానిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై త‌ప్ప‌క ప్ర‌భావం చూపుతుంద‌ని అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ స్ప‌ష్టం చేసింది. దేశంలో రాను రాను క్లౌడ్ సేవ‌ల కోసం డిమాండ్ పెరుగుతోంద‌ని తెలిపింది. భారీ పెట్టుబ‌డులకు సంబంధించి గురువారం అమెజాన్ కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. భారతీయ వ్యాపారాల‌కు మ‌రింత ఊతం ఇస్తుంద‌ని తెలిపింది. దీని వ‌ల్ల వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాలు క‌లుగుతాయ‌ని అమెజాన్ పేర్కొంది.

నిర్మాణం, సౌక‌ర్యాల నిర్వ‌హ‌ణ‌, ఇంజ‌నీరింగ్ , టెలిక‌మ్యూనికేష‌న్స్, ఇత‌ర ఉద్యోగాల‌తో స‌హా ఈ స్థానాలు భార‌త దేశంలోని డేటా సెంట‌ర్ స‌ర‌ఫరాలో ఒక భాగం కానుంద‌ని తెలిపింది. ఈ పెట్టుబ‌డి 2030 నాటికి మొత్తం స్థూల జాతీయ ఉత్ప‌త్తికి రూ . 1,94,700 కోట్లు అందించ గ‌ల‌ద‌ని అంచ‌నా వేసిన‌ట్లు అమెజాన్ స్ప‌ష్టం చేసింది.

Also Read : DK Shiva Kumar

Leave A Reply

Your Email Id will not be published!