Faf Du Plessis : ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

71 ప‌రుగుల‌తో ఆర్సీబీ గెలుపులో కీల‌కం

Faf Du Plessis : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మ‌రోసారి మెరిశాడు. త‌న‌దైన శైలిలో దుమ్ము రేపాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు హైద‌రాబాద్ విసిరిన 186 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంకా 4 బంతులు ఉండ‌గానే విజ‌యం సాధించేలా కీల‌క పాత్ర పోషించాడు. త‌న స‌హ‌చ‌రుడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీతో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడుగా నిలిచాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. విరాట్ సెంచ‌రీతో క‌దం తొక్కితే ఫాఫ్ దుమ్ము రేపాడు. 47 బంతులు ఎదుర్కొని 71 ప‌రుగులు చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

టోర్నీలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీలో అగ్ర స్థానంలో నిలిచాడు ఫాఫ్ డుప్లెసిస్. ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కెప్టెన్ 13 లీగ్ మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 702 ర‌న్స్ చేశాడు. ఇక అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగుల లిస్టులో రెండో స్థానంలో 576 ప‌రుగుల‌తో శుభ్ మ‌న్ గిల్ కొన‌సాగుతుండ‌గా త‌ర్వాతి స్థానాల్లో య‌శ‌స్వి జైస్వాల్ , డెవాన్ కాన్వే , సూర్య కుమార్ యాద‌వ్ ఉన్నారు.

ఇక అంత‌కు ముందు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో హెన్రిచ్ క్లాసెన్ ఆర్సీబీ బౌల‌ర్ల‌ను భ‌రతం ప‌ట్టాడు. చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు.

Also Read : Virat Kohli

 

Leave A Reply

Your Email Id will not be published!