David Warner : వార్నర్ ఒంటరి పోరాటం వృధా
ఐపీఎల్ 16వ సీజన్ లో ఒకే ఒక్కడు
David Warner : ఐపీఎల్ లీగ్ నుంచి డేవిడ్ వార్నర్(David Warner) సేన నిష్క్రమించింది. కానీ కెప్టెన్ వార్నర్ మాత్రం దుమ్ము రేపాడు. ఈ సీజన్ లో ఆ జట్టు తరపు నుంచి అత్యధిక పరుగులు చేశాడు. తనకు ఎదురే లేదని చాటాడు. జట్టు పరంగా సహకారం లేక పోవడం వార్నర్ కు ఇబ్బందిగా మారింది. అనూహ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అవమానాలు ఎదుర్కొన్నా ఆ తర్వాత తేరుకున్నాడు వార్నర్.
పోయిన చోటనే వెతుక్కోవాలనే పట్టుదలతో తానేమిటో మరోసారి నిరూపించాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన కీలక పోరులో ఎలాగైనా సరే గెలిచి పరువు నిలబెట్టాలని అనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు.
మిగతా ఆటగాళ్లు ఒక్కరొక్కరే పెవిలియన్ దారి పట్టినా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే షా వికెట్ ను కోల్పోయింది. 5 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 86 రన్స్ చేశాడు.
ఫీల్ సాల్ట్ 3 రన్స్ చేస్తే రాసో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. యష్ ధుల్ 13 రన్స్ చస్తే అక్షర్ పటేల్ 15, అమన్ 7 , లలిత్ 6 పరుగులు చేసి నిరాశ పరిచారు. . దీపక్ చాహర్ 3, తీక్షణ , పతిరణ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
Also Read : Devon Conway