Nicholas Pooran : చిత‌క్కొట్టిన నికోల‌స్ పూర‌న్

కోల్ క‌తా బౌల‌ర్ల‌కు చుక్క‌లు

Nicholas Pooran : ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 16వ సీజ‌న్ లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ ఉత్కంఠ‌ను రేపింది. చివ‌రి దాకా ఏ జ‌ట్టు గెలుస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ ఒకే ఒక్క ప‌రుగు తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

యూపీ కుర్రాడు రింకూ సింగ్ మైదానంలో ఉన్నంత వ‌ర‌కు ల‌క్నో ఆశ‌లు వ‌దులుకుంది. కానీ చివ‌రి దాకా ఉన్నా గెలిపించ లేక పోయాడు. జ‌ట్టును గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చాడు రింకూ సింగ్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ .

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట ల‌క్నో బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి రెచ్చి పోయాడు నికోల‌స్ పూర‌న్(Nicholas Pooran). ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 4 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 58 ర‌న్స్ చేశాడు. క్వింట‌న్ డికాక్ 28, ప్రేర‌క్ 26 , ఆయుష్ బ‌దోనీ 25 ర‌న్స్ తో రాణించారు. కోల్ క‌తా బౌల‌ర్ల‌లో స‌రైన్ , శార్దూల్ , వైభ‌వ్ చెరో 2 వికెట్లు తీశారు.

దీంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. 10 ఓవ‌ర్ల వ‌ర‌కు ల‌క్నోను పూర్తిగా క‌ట్ట‌డి చేశారు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. కానీ పూరన్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు.

Also Read : KKR vs LSG IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!