Jeff Bezos Lauren Sanchez : లారెన్ తో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం
గత కొంత కాలంగా డేటింగ్ లో అమెజాన్ సిఇఓ
Jeff Bezos Lauren Sanchez : ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(Jeff Bezos) ఓ ఇంటి వాడు కాబోతున్నారు. గత కొంత కాలం నుంచి ఆయన డేటింగ్ లో ఉన్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్(Lauren Sanchez) తో ఎట్టకేలకు ఎంగేజ్ మెంట్ కుదుర్చుకున్నాడు. బెజెస్ అమెజాన్ కు సిఇఓగా ఉన్నారు. ఇక లారెన్ శాంచెజ్ మాజీ మీడియా జర్నలిస్ట్ గా పని చేశారు.
2018 నుంచి వీరిద్దరూ లవ్ లో కూరుకు పోయారు. ఆనాటి నుంచి నేటి దాకా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఈ ఇద్దరూ పీకల లోతు ప్రేమలో పడ్డారని చివరకు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారంటూ ప్రముఖ మీడియా సంస్థ పేజ్ సిక్స్ వెల్లడించింది.
లారెన్ శాంచెజ్ కు భారీ గిప్ట్ అందించాడు జెఫ్ బెజోస్. దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందనేది ఇంకా తెలియదు. ఈ ఇద్దరూ పెళ్లికి సిద్దం అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు వాటిని నిజం చేశారు జెఫ్ బెజోస్ , లారెన్ శాంచెజ్. 2019లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా బెజోస్ కు ఇది వరకే పెళ్లి అయ్యింది.
25 ఏళ్ల తన భార్య మెకంజీ స్కాట్ తో విడాకులు తీసుకునేంత దాకా బయట పడేందుకు ఇష్ట పడలేదు అమెజాన్ చీఫ్. ఇదిలా ఉండగా ఈ ఇద్దరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విడాకుల సందర్భంగా మొదటి భార్య మెకంజీ $38 బిలియన్ల డాలర్లు పరిహారంగా పొందారు. సగం దాతృత్వానికి అందజేశారు. దీంతో అమెజాన్ ఉమ్మడి స్టాక్ లో 25 శాతంతో పర్పంచంలోనే మూడో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందింది.
Also Read : Sourav Ganguly
