Temjen Imna Along : సంతోషం వెల క‌ట్ట‌లేం – ఇమ్నా

బీజేపీ మంత్రి టెమ్ జెన్ కామెంట్స్

Temjen Imna Along : టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భార‌త దేశంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీలో అత్య‌ధిక ఫాలోయింగ్ క‌లిగిన నేత‌ల్లో నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along). నిత్యం అల‌ర్ట్ గా ఉంటాడు. సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటాడు. ఎక్క‌డ స‌మ‌స్య ఉన్నా వెంట‌నే స్పందిస్తాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం చేస్తుండ‌డంతో ఎంత మంది మంత్రులు ఉన్నా టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ నే ఎక్కువ‌గా అక్క‌డి ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ ప‌డతారు.

రోజు రోజుకు మ‌రింత యంగ్ గా ఎన‌ర్జ‌టిక్ గా ఉన్న టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ ఉన్న‌ట్టుండి శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. ఆపై అద్భుత‌మైన క్యాప్ష‌న్ కూడా జ‌త చేశాడు. అదేమిటంటే ప్ర‌తి దానికి ఈ లోకంలో ధ‌ర ఉంది. ప్ర‌తి వ‌స్తువుకు వెల‌ను నిర్ణ‌యించారు. కానీ మ‌నం ఆనంద‌గా ఉండ‌టానికి, సంతోషం పొంద‌డానికి ఎలాంటి ఖ‌ర్చు లేదు. మ‌రి ఎందుకు ఆందోళ‌న ప‌డాలి అంటూ ప్ర‌శ్నించాడు. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకుంటే స‌మ‌స్య‌లు అంటూ ఏవీ ద‌రి చేర‌వ‌ని పేర్కొంటాడు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.

ప్ర‌స్తుతం తాజాగా ఆయ‌న చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఎంతైనా ఇమ్నానా మ‌జాకా అంటున్నారు ఆయ‌నను అనుస‌రించే ఫ్యాన్స్. మొత్తంగా బీజేపీలో టాప్ లో మోదీ కొన‌సాగుతుండ‌గా ఇప్పుడు ఆయ‌న‌తో పాటు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ కూడా చేరాడు. ఆయ‌న‌తో పాటు త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై కూడా పోటీ ప‌డుతుండ‌డం విశేషం.

Also Read : RS Praveen Kumar

 

Leave A Reply

Your Email Id will not be published!