1983 Kapil Team Urges : మహిళా రెజ్లర్లు తొందర పడొద్దు
1983 వరల్డ్ కప్ ఛాంపియన్లు
1983 Kapil Team Urges : మహిళా రెజ్లర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు 1983 వరల్డ్ కప్ సాధించిన కపిల్ దేవ్ జట్టు ఆటగాళ్లు(1983 Kapil Team Urges). సునీల్ గవాస్కర్ , మోహిందర్ అమర్ నాథ్ వంటి దిగ్గజాలను కలిగి ఉన్న క్రికెట్ జట్టు సూచించడం కలకలం రేపింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మహిళా రెజ్లర్లకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేతలు నరేష్ టికాయత్, రాకేశ్ టికాయత్ మద్దతు ప్రకటించారు.
మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరు, పోలీసుల దాడులను చూసి తాము తీవ్రంగా బాధ పడ్డామని పేర్కొన్నారు. ఒకింత కలవరానికి గురైనట్లు వాపోయారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్ 23 నుండి మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆందోళనను ఉధృతం చేశారు.
శుక్రవారం కీలక ప్రకటన చేశారు 1983 కపిల్ సేన సభ్యులు. కష్టపడి సంపాదించిన పతకాలను పవిత్ర గంగా నదిలోకి విసిరి వేయడం వంటి తీవ్రమైన చర్యలకు దిగవద్దని కోరారు. ఇదిలా ఉండగా ఆఖరు నిమిషంలో పతకాలను నిమజ్జనం చేయకుండా అడ్డుకున్నారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత నరేష్ టికాయత్. కేంద్రానికి 5 రోజుల గడువు ఇచ్చారు. దీంతో ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు.
ఆ పతకాలు సంవత్సరాల తరబడి కృషి , త్యాగం, సంకల్పం కలిగి ఉన్నాయని , వారి స్వంతం మాత్రమే కాదు , దేశానికి సంబంధించిన గర్వం , సంతోషం కూడాను అని స్పష్టం చేశారు కపిల్ దేవ్ నేతృత్వంలోని గవాస్కర్, మోహిందర్ నాథ్.
Also Read : Rahul Gandhi