Odisha Train Comment : మానవ తప్పిదమా సాంకేతిక లోపమా
ఒడిశా రైలు దుర్ఘటన మహా విషాదం
Odisha Train Comment : ఒడిశాలోని బాలా సోర్ లో చోటు చేసుకున్న రైలు(Train) దుర్ఘటనను చూసి జాతి యావత్తు కదిలి పోయింది. ఇది మహా విషాదం. అంతులేని దుఃఖాన్ని కలిగించింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన రైలు ఘటనల్లో అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటి. ఈ విషాద సమయంలో కేవలం సాయం చేసే చేతులు తప్ప ఇంకేమీ మాట్లాడేందుకు వీలు లేదు. టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునిక వ్యవస్థ తీసుకు వచ్చిన సౌకర్యాలు ఎన్నో ఉన్నప్పటికీ దేశంలోనే అతి పెద్ద వ్యవస్థగా పేరు పొందిన రైల్వే వ్యవస్థ వైపు అందరి చూపు నిలిచింది. ఈ ఘోరమైన దుర్ఘటన కాకతాళీయంగా జరిగిందా. లేక మానవ తప్పిదం ఏమైనా ఉందా లేక సాంకేతిక లోపం ఏమైనా సంభవించిందా అన్నది తేలాల్సి ఉంది.
దీనిని పక్కన పెడితే నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది రైళ్లు(Trains) ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర వేస్తున్నాయి. కోటిన్నర మందికి పైగానే ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాలలో, అభివృద్ది చెందిన దేశాలలో చాలా అరుదుగా జరుగుతాయి. కారణం ముందస్తు హెచ్చరికలు, కంట్రోలింగ్ సిస్టమ్ ను అభివృద్ది చేయడం. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం 2022-23కు సంబంధించి కవాచ్ పేరుతో సిస్టమ్ ను డెవలప్ చేసింది. దీనికింద ఒక కిలోమీటర్ కు దాదాపు రూ. 50 లక్షలు ఖర్చవుతుంది. ఒకవేళ ఏ ట్రైన్ అయినా పట్టాలు తప్పినా లేక సిగ్నల్ లో సాంకేతిక లోపం సంభవించినా, పైలట్ అజాగ్రత్తలో ఉన్నా, ఏమరుపాటు లేక పోయినా వెంటనే ఈ సిస్టమ్ గుర్తిస్తుంది. 5 కిలోమీటర్ల దూరంలోనే ఎక్స్ ప్రెస్ రైలును నిలిపి వేస్తుంది.
దీని వల్ల అటు వైపు నుంచి వచ్చే రైళ్లు(Trains) కూడా ఆగి పోతాయి. దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉండదు. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె రెండు సార్లు కేంద్రంలో రైల్వే శాఖ మంత్రి గా పని చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన వెంటనే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను నిలదీశారు. ఎందుకని యాంటీ కొలీసియన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దీనికి నీళ్లు నమిలారు కేంద్ర మంత్రి. ఒకవేళ దీదీ చెప్పినట్టు ముందు జాగ్రత్తగా ఏసీఎస్ ను ఇక్కడ ఏర్పాటు చేసి ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు రైల్వే శాఖ భద్రత, సమర్థతపై సమీక్షించినా ఫలితం లేకుండా పోయింది. వందే భారత్ ట్రైన్లను జెండా ఊపి ప్రారంభించడంలో ఉన్నంత శ్రద్ద ఎందుకని రైళ్ల వ్యవస్థపై లేకుండా పోయిందంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఈ విషాద సమయంలో కావాల్సింది సహాయమే అయినా ఎక్కడ లోపం జరిగిందన్నది తేల్చాల్సింది రైల్వే కమిటీ. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఏకంగా ఈ ఘటనను జాతీయ విషాదంగా పేర్కొన్నారు. ఇక పోయిన ప్రాణాలు ఎలాగూ తేలేం. కానీ ఇక నుంచైనా అతి పెద్ద రైల్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సెక్యూరిటీ పై ఫోకస్ పెడితే కొంత మేరకైనా దారుణాలు జరగకుండా ఉంటాయి. మొత్తంగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
Also Read : YS Sharmila KCR

Best site for perfect movie news and boxoffice collections, iam watching your site from years…all the best to you sir….your site will get grow much more heights in forth coming days….wishing you much more success