Gudivada Amarnath : చంద్ర‌బాబు నుంచే ప‌వ‌న్ కు హాని

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్

Gudivada Amarnath : ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు నిప్పులు చెరుగుతున్నారు. మాట‌ల‌తో మంట‌లు రేపుతున్నారు. వారాహి విజ‌య యాత్ర పేరుతో ఏపీలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం జ‌గ‌న్ పై, వైసీపీ నేత‌ల‌పై నోరు పారేసు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్.

ఏపీ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. అస‌లు ఎన్ని రోజులు ఏపీలో ఉన్నావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక్క‌డ నువ్వ ప‌నికి రావ‌ని జ‌నం ఎప్పుడో డిసైడ్ అయ్యార‌ని, అందుకే కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని గుర్తు చేశారు. అన‌వ‌స‌రంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు.

త‌మ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాయ మాట‌లు చెప్ప‌ర‌ని అన్నారు. కేవ‌లం చేసి చూపిస్తార‌ని అందుకే మ‌రోసారి ఆయ‌నే సీఎం అవుతార‌ని స్ప‌ష్టం చేశారు గుడివాడ అమ‌ర్నాథ్(Gudivada Amarnath). త‌న‌కు జ‌గ‌న్ నుంచి ప్రాణ హాని ఉండ‌ద‌ని కానీ తాను తూచ త‌ప్ప‌కుండా పాటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వ‌ల్ల‌నే ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

జ‌ర జాగ్ర‌త్త అని సూచించారు. ముద్ర‌గ‌డ‌ను చంపాల‌ని అనుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ ను లీడ‌ర్ గా గుర్తించార‌ని నిన్ను ప‌క్క‌న పెట్టారంటూ ఎద్దేవా చేశారు గుడివాడ అమ‌ర్నాథ్. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో పారిశ్రామికంగా దూసుకు పోతోంద‌న్నారు. ఆనాడు వంగ‌వీటి రంగాను ఎవ‌రు చంపించారో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

Also Read : Anil Ambani VS Elon Musk : అంబానీ మ‌స్క్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!