Joe Biden PM Modi : అమెరికా..భారత్ బంధం శాశ్వతం
ప్రెసిడెంట్ బైడెన్ సంచలన వ్యాఖ్యలు
Joe Biden PM Modi : ప్రపంచంలో భారత్, అమెరికా ప్రజాస్వామిక దేశాలు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు యుఎస్ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. ప్రెసిడెంట్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం పలికారు బైడెన్. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఇరు దేశాలు నిలిచాయని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు బలమైన దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. దీని వల్ల యావత్ ప్రపంచానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.
ఇవాళ భారత దేశం అత్యంత నమ్మకమైన, విశ్వాసమైన , మిత్ర దేశంగా అమెరికా భావిస్తోందని చెప్పారు. వైట్ హౌస్ లో విందు సందర్బంగా జోసెఫ్ బైడెన్(Jeo Biden) ప్రసంగించారు. ఆయన భారత దేశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ, అంతరిక్షం, వ్యాపార, వాణిజ్యం, డిజిటలైజేషన్, స్టార్టప్ , శాస్త్ర సాంకేతిక అంశాలపై ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా చర్చించారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి 19 గన్ సెల్యూట్ తో స్వాగతం పలకడం విశేషం. ఇరు దేశాలు ఎందుకు కలిసి పని చేయాలో కూడా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు జోసెఫ్ బైడెన్. రెండు దేశాలు అత్యంత గొప్పవైనవని, అంతకు మించి శక్తి కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడినైన తర్వాత భారత్ తో సత్ సంబంధం కలిగి ఉండేందుకు ప్రయత్నం చేశానని చెప్పారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణకు ప్రయారిటీ ఇవ్వడం ముఖ్యమని గుర్తించామన్నారు. వైట్ హౌస్ రెండు దేశాల మధ్య వారధిగా ఉండ బోతోందన్నారు బైడెన్.
Also Read : ED Raids : మెడికల్ కాలేజీల సీట్లపై ఈడీ నజర్
