Jagananna Suraksha : జ‌గ‌నన్న సుర‌క్ష శ్రీ‌రామ‌ర‌క్ష‌

ఇంటి వ‌ద్ద‌కే స‌ర్టిఫికెట్ల పంపిణీ

Jagananna Suraksha : ఏపీ జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది అదే జ‌గ‌న‌న్న సుర‌క్ష‌. రాష్ట్ర మంత‌టా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌య ప‌రిధిలో నెల రోజుల పాటు దీనిని చేప‌ట్ట‌నున్నారు. లాంఛ‌నంగా శుక్ర‌వారం ప్రారంభించారు సీఎం. జ‌న‌న‌, మ‌ర‌ణ‌, కుల, సీసీఆర్సీ, రేష‌న్ కార్డు డివిజ‌న్ , హౌస్ హోల్డ్ డివిజ‌న్ ఉచితంగా వారికి అంద‌జేయ‌నున్నారు . అర్హులైన వారు ఏ ఒక్క‌రు లబ్ది పొంద‌కుండా మిగిలి పోకూడ‌ద‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

కుల, మ‌త , వ‌ర్గ‌, పార్టీల‌కు అతీతంగా లంచాల‌కు, వివ‌క్ష‌కు తావు లేకుండా వంద‌కు వంద శాతం పార‌ద‌ర్శ‌కంగా సంక్షేమ ఫ‌లాలు అంద‌జేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశించారు జ‌గ‌న్ రెడ్డి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తి ఇంటికి వెళ్లి స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే తెలుసుకుని ప‌రిష్కారం చూపించే దిశ‌గా చేస్తున్న వినూత్న కార్య‌క్ర‌మమే జ‌గ‌న‌న్న(YS Jagan) సుర‌క్ష‌. వాలంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది, ప్ర‌జా ప్ర‌తినిధుల టీమ్ 10 రోజుల పాటు కోటి 60 ల‌క్ష‌ల ఇళ్ల‌ల‌ను సంద‌ర్శిస్తారు. ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తే టోకెన్ నెంబ‌ర్ ఇచ్చి ఉచితంగా ఇస్తారు.

జూలై 1 నుండి క్యాంపుల నిర్వ‌హ‌ణ చేప‌డ‌తారు. మండ‌ల స్థాయిలో త‌హ‌శీల్దార్ , ఈవో పీఆర్డీ ఒక టీమ్ , ఎంపీడీఓ , డిప్యూటీ త‌హ‌శీల్దార్ రెండో టీమ్ చూస్తుంది. ప్ర‌తి స‌చివాల‌యంలో క్యాంపు చేప‌ట్టి సేవా ఛార్జీలు లేకుండానే స‌ర్టిఫికెట్లు అంద‌జేస్తారు. అన్ని ప‌త్రాల‌ను ఫీజు లేకుండానే జారీ చేస్తారు. 26 జిల్లాల‌కు 26 మంది ప్ర‌త్యేక ఐఏఎస్ అధికారులు, క‌లెక్ట‌ర్లు , జేసీలు, ఇత‌ర ఆఫీస‌ర్ల‌తో క్యాంపులు చేప‌డ‌తారు. ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే 1902 హెల్ప్ డెస్క్ కు తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : Joe Biden PM Modi : అమెరికా..భార‌త్ బంధం శాశ్వ‌తం

 

Leave A Reply

Your Email Id will not be published!