Tamim Iqbal : తమీమ్ కంట తడి క్రికెట్ కు గుడ్ బై
భావోద్వేగానికి గురైన బంగ్లా క్రికెటర్
Tamim Iqbal : బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కంట తడి పెట్టారు. తన తండ్రిని తల్చుకుని ఏడ్చాడు. క్రికెట్ కు సంబంధించి అన్ని ఫార్మాట్ ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఉన్నట్టుండి గురువారం ఈ ప్రకటన చేశాడు. దీంతో క్రికెట్ లోకం విస్తు పోయింది. ఆ జట్టు తరపున అద్భుతమైన క్రికెటర్ గా రాణించాడు.
వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. తన జట్టు తరపున అనేక విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించాడు తమీమ్ ఇక్బాల్. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వీడ్కోలు పలుకుతున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు.
ప్రత్యేకించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఘనత తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) ది. ఈ సందర్బంగా తన తండ్రిని తల్చుకున్నాడు. తన తండ్రికి ఒక తీరని కోరిక , కల ఉండేదన్నాడు. ఆ కలను తీర్చేందుకు తాను అలుపెరుగని రీతిలో కృషి చేశానని చెప్పాడు.
చివరకు తీర్చినందుకు ఒకింత సంతోషంగా ఉందని కానీ ఆటను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని అన్నాడు తమీమ్ ఇక్బాల్. తన కెరీర్ లో 16 ఏళ్ల పాటు ఆడాడు ఈ బంగ్లాదేశ్ కెప్టెన్. 2007లో అడుగు పెట్టిన ఇక్బాల్ అన్ని ఫార్మాట్ లలో రాణించాడు. ప్రత్యేకించి భారత్ పై బిగ్ ట్రాక్ రికార్డు ఉండడం విశేషం.
Also Read : Eknath Shinde : నా రాజీనామా అబద్దం – షిండే
