SS Thaman Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంగీత ప్రియుడు

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్

SS Thaman Pawan Kalyan : సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత‌మైన న‌టుడే కాద‌ని అంత‌కు మించి సంగీతం ప‌ట్ల అభిరుచి ఉందంటూ కితాబు ఇచ్చాడు. ఆయ‌న ప్ర‌తి పాట‌ను ద‌గ్గ‌రుండి చూస్తార‌ని, దాని అర్థం ఏమిటో కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని పేర్కొన్నాడు. ఇలాంటి అల‌వాటు కొద్ది మంది హీరోల‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు ఎస్ఎస్ థ‌మ‌న్.

ఇదిలా ఉండ‌గా తాను ప‌వ‌ర్ స్టార్ ను చూసి విస్తు పోయాన‌ని పేర్కొన్నాడు. కార‌ణం ఏమిటంటే అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా వెంట‌నే పుస్త‌కాల‌ను చ‌ద‌డంలో నిమ‌గ్నమై పోతార‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్.

ఇదిలా ఉండ‌గా ఎస్ ఎస్ థ‌మ‌న్(SS Thaman) తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ , సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన బ్రో ది అవ‌తార్ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ , టీజ‌ర్, సాంగ్ దుమ్ము రేపుతున్నాయి. భారీ ఆద‌ర‌ణ చూర‌గొంటున్నాయి. ప్ర‌తి ట్యూన్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన్నార‌ని, త‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించారంటూ ఆనందం వ్య‌క్తం చేశాడు ఎస్ఎస్ థ‌మ‌న్. బ్రో సినిమాకు గ‌తంలో తాను చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుంద‌న్నాడు సంగీత ద‌ర్శ‌కుడు.

కాగా ప‌వ‌ర్ స్టార్ న‌టిస్తున్న ఈ చిత్రంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. స్టెప్పులు, డిఫ‌రెంట్ డైలాగుల‌తో జ‌న‌సేనాని ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌ని అంటున్నారు.

Also Read : MLC Kavitha : కొముమ‌ర‌మ్మ ఎట్టున్న‌వ్ – క‌విత

 

Leave A Reply

Your Email Id will not be published!