Revanth Reddy KCR : కేసీఆర్ వ‌ల్ల‌నే బ‌షీర్ బాగ్ లో కాల్పులు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy KCR : కాంగ్రెస్ పార్టీ విధానాల‌ను తెలియ చేసేందుకే తాను అమెరికాలోని తానా స‌భ‌లో పాల్గొన్నాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ చేసిన కామెంట్స్ వ‌ల్ల‌నే బ‌షీర్ బాగ్ లో కాల్పులు జ‌రిగాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉచిత విద్యుత్ ప‌థ‌కం తీసుకు వ‌చ్చిందే కాంగ్రెస్ పార్టీ అని స్ప‌ష్టం చేశారు.

మంత్రి కేటీఆర్ త‌న మాట‌ల‌ను ఎడిట్ చేసి అతి తెలివి ప్ర‌ద‌ర్శించారంటూ మండిప‌డ్డారు. విద్యుత్ వినియోగంపై తాను చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. తాను రైతు బిడ్డ‌ను. తాను పొలం ప‌నులు కూడా చేశాన‌ని చెప్పారు. తాను మాట్లాడిన మాట‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా చేశారంటూ ఆరోపించారు.

ఉచిత విద్యుత్ గురించి చ‌ర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంద‌న్నారు. మోటార్లు కాలిపోతుంటే , స్టార్ట‌ర్లు పేలి పోతే ఆ విష‌యం తెలిసి తాను రైతుల గురించి మాట్లాడానే త‌ప్పా ఏ ఒక్క మాటా తాను వ్య‌తిరేకంగా మాట్లాడ లేద‌ని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్, కేటీఆర్ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. నేను పొలం దున్నా..నాగ‌లి ప‌ట్టుకున్నా. మ‌రి కేటీఆర్ , దొర కేసీఆర్ ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Revanth Reddy : నా వ్యాఖ్య‌ల్ని వ‌క్రీక‌రించారు – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!