Cristiano Ronaldo : యుద్ద రంగంలోకి రొనాల్డో రెడీ

ప్రాక్టీస్ చేస్తున్న ఫుట్ బాల‌ర్

Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో ఎక్క‌డ ఉంటే అక్క‌డ అభిమానులు గుమి గూడ‌తారు. ఆపై అత‌డి కోసం ఎగ‌బ‌డ‌తారు. మోస్ట్ పాపుల‌ర్ ఫుట్ బాల‌ర్ . ప్ర‌పంచంలోనే టాప్ త్రీలో ఉన్న ఏకైక ఆట‌గాడు రొనాల్డో. బ‌య‌ట డిఫ‌రెంట్ గా క‌నిపించే రొనాల్డో మైదానంలోకి వ‌చ్చాడంటే ఇక క‌ళ్ల‌న్నీ బంతిపైనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో ఎంత మంది ఆట‌గాళ్లు ఉన్నా ప‌ట్టించుకోడు. గోల్ ఎలా కొట్టాల‌న్న‌దే త‌న ధ్యాస‌. అందుకే అత‌డి క‌ళ్లు పులి , డేగ క‌ళ్ల కంటే షార్ప్ గా ఉంటాయ‌ని క్రీడా వ‌ర్గాలు పేర్కొంటాయి.

Cristiano Ronaldo Fans

మ‌నోడి చుట్టూ వంద‌ల కంపెనీలు కోట్లాది వ్యాపారం చేస్తున్నాయి. ఒక్క బంతి గోల్ కొడితే వంద‌ల కోట్లు వ‌చ్చి వాలి పోతాయి. ఇది రొనాల్డో కు ఉన్న స్పెషాలిటీ. ఫుట్ బాల్ రంగంలో రొనాల్డో(Cristiano Ronaldo) వ‌ర్సెస్ మెస్సీ ఉన్నా ఇద్ద‌రికి ఇద్ద‌రే . ఎవ‌రికి వారే. కానీ గ్రౌండ్ లోకి వ‌స్తే చిరుత దాడి చేసిన‌ట్టుగా ఉంటుంది రొనాల్డోను చూసిన వారికి.

1985లో డాస్ శాంటాస్ అవీరోలో పుట్టాడు. పోర్చుగ‌ల్ దేశానికి చెందిన వాడు రొనాల్డో. పోర్చుగ‌ల్ జాతీయ జ‌ట్టుకు 2003 నుండి కెప్టెన్ గా ఉన్నాడు. మాంచెస్ట‌ర్ యునైటెడ్ జ‌ట్టుకు ఫార్వ‌ర్డ్ లో ఆడ‌తాడు. ఐదు బ్యాల‌న్ డి ఓర్ అవార్డులు, నాలుగు యూరోపియ‌న్ గోల్డెన్ షూస్ ను గెలుచుకున్నాడు. ఈ రెండు రికార్డులు సాధించిన ఏకైక ఐరోపా ఆట‌గాడు రొనాల్డో. త‌న కెరీర్ లో 30 ప్ర‌ధాన ట్రోఫీల‌ను గెలుచుకున్నాడు.

Also Read : Nelson Mandela : నెల్స‌న్ మండేలా ఇంట‌ర్నేష‌న‌ల్ డే

Leave A Reply

Your Email Id will not be published!