Suriya Viral : తమిళనాట సినిమాలకు ఆదరణ ఎక్కువ. అక్కడ హీరోలకు భారీ ఎత్తున ఆదరణ ఉంటుంది. పిచ్చిగా ప్రేమిస్తారు. అంతకంటే ఎక్కువగా ఆదరిస్తారు. అక్కడ సీఎంలు కూడా అయిన సందర్భాలు లేక పోలేదు. తాజాగా పలువురు నటులు గత కొన్నేళ్లుగా పోటీ పడుతూ వస్తున్నారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ(Kanguva) ఇంకా రిలీజ్ కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Suriya Viral With Kanguva
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది నటుడు సూర్య సెన్సేషన్ గా మారారు. కారణం ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు సంబంధించి పోటీ పడ్డారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాట సూర్యను నాయగన్ అని పిలుచుకుంటారు. ఆయన ఇటీవలే అభిమానులతో సమావేశం అయ్యారు. ఇక కోలీవుడ్ లో రజనీకాంత్ , జోసెఫ్ విజయ్ , కార్తీ, సూర్య, తదితర నటులు ఎందరో ఉన్నారు. వారందరికీ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సూర్య నటించిన కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి.
అనుకున్న దాని కంటే అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నాడు తనే స్వయంగా సూర్య. వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 పూర్తి చేశాక వాడి వాసల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ సూర్యకు కథ కూడా వినిపించాడని టాక్. ఏది ఏమైనా సూర్య మేనియా మాములుగా లేదుగా.
Also Read : Chandrababu Naidu Writes : రాష్ట్రపతి..ప్రధానికి బాబు లేఖ
