Mandakrishna Madiga : కుల పిచ్చోడు రేవంత్ రెడ్డి

మంద‌కృష్ణ మాదిగ కామెంట్

Mandakrishna Madiga : ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కుల పిచ్చోడ‌న్నారు. అంతే కాదు లోప‌ల క‌త్తులు పెట్టుకుని పైకి మాత్రం అన్ని కులాల‌ను ప్రేమిస్తున్న‌ట్లు న‌టిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Mandakrishna Madiga Slams Revanth Reddy

రేవంత్ రెడ్డి కంటే మిగ‌తా రెడ్లే న‌య‌మ‌న్నారు. అన్ని పార్టీల‌కు రెడ్డిల‌ను అధ్య‌క్షులు చేయాల‌ని రేవంత్ కోరుకున్న‌ట్టుగానే కిష‌న్ రెడ్డిని బీజేపీ చీఫ్ గా నియ‌మించింద‌న్నారు. ఇదే విష‌యంపై కిష‌న్ రెడ్డిని కూడా తాను ప్ర‌శ్నించాన‌ని అన్నారు. విచిత్రం ఏమిటంటే బీజేపీకి ఉన్న బీసీ నేత బండి సంజ‌య్ కుమార్ ను తీసేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఉన్నంత కుల పిచ్చి ఇంకే నాయ‌కుడికి లేద‌న్నారు. ఆయ‌న కోరిక అంతా ఒక్క‌టే అన్ని పార్టీల‌కు రెడ్లు మాత్ర‌మే ఉండాల‌ని. ఇక బీఆర్ఎస్ కు మాత్రం లేద‌న్నారు. రెడ్ల చేతుల్లోనే భూములు ఉండాల‌ని అన్న‌డు రేవంత్ రెడ్డి. ఇలాంటోడిని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎలా నియ‌మించిందో అర్థం కావ‌డం లేదన్నారు మంద‌కృష్ణ మాదిగ‌(Mandakrishna Madiga).

ద‌య‌చేసి రాష్ట్ర ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి కుల గ‌జ్జి క‌లిగిన రేవంత్ రెడ్డిని ప‌క్క‌న పెట్టాల‌ని పిలుపునిచ్చారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ప‌ట్ల క‌నీసం కూడా స్పందించక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : Varudu Kalyani : ప‌వ‌న్ ప్ర‌జా కోర్టులో తేల్చుకుందాం

Leave A Reply

Your Email Id will not be published!