Revanth Reddy Gunmen : రేవంత్ కు గన్ మెన్ లు గుడ్ బై
పోలీసుల దుస్తులు ఊడదీస్తానన్న రెడ్డి
Revanth Reddy Gunmen : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఖాకీలపై నోరు పారేసుకున్నందుకు గాను గన్ మెన్లు ఝలక్ ఇచ్చారు. తాము క్షమాపణలు చెప్పేంత వరకు రాబోమంటూ తేల్చి చెప్పారు. పోలీసుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఖాకీల గుడ్డలు ఊడ దీసి కొడతానని, తాను రెడ్ డైరీలో మీ పేర్లను రాసుకుంటున్నానని హెచ్చరించారు. అంతే కాదు తాము అధికారంలోకి వచ్చాక మీ అందరి అంతు చూస్తానని చెప్పడంపై భగ్గుమంటున్నారు.
Revanth Reddy Gunmen Said Good Bye
ఇదే సమయంలో తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను కావాలని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ప్రత్యేకించి ఆయన ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. మంత్రి మాటలు విని తమ వారిపై వేధింపులకు పాల్పడడమే కాకుండా దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, అధికారంలోకి వస్తామని అప్పుడు పోలీసుల పని పడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు సంఘం నేతలు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇదే సమయంలో సంఘం అధ్యక్షుడు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తమపై నోరు పారేసుకున్నందుకు గాను డ్యూటీకి రామంటూ గన్ మెన్లు గుడ్ బై చెప్పారు.
Also Read : Congress Flexi : హరీశ్ కు కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీ