Pawan Khera : ట్రావెల్ ఏజెన్సీల‌కు మోడీ స‌ర్కార్ స‌పోర్ట్

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా

Pawan Khera : కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ ప‌వ‌న్ ఖేరా షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీలో పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. చైనాకు చెందిన వ్య‌క్తి చేసిన ఈ మోసానికి బాధ్యులు ఎవ‌రో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

చైనా పౌరుడు త‌యారు చేసిన యాప్ ను పోలీసులు ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ప‌వ‌న్ ఖేరా, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈఓడబ్ల్యూ, ఈడీ, సీబీఐ, డీఆర్ఐ నిద్ర పోతున్నారా అని నిల‌దీశారు. మోడీ ప్ర‌భుత్వం మోస‌గాళ్ల‌కు ట్రావెల్ ఏజెన్సీగా మారిందా అన్న అనుమానం వ్య‌క్తం చేశారు.

Pawan Khera Slams Modi Govt

డాని డేటా యాప్ ఎవ‌రి కోరిక మేర‌కు ప్ర‌చారం చేశారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇంకా ఎంత కాలం ఇలాంటి మోసాల‌తో దేశాన్ని నాశ‌నం చేయాల‌ని అనుకుంటున్నారంటూ మండిప‌డ్డారు ప‌వ‌న్ ఖేరా(Pawan Khera) . ఇప్ప‌టికే దేశాన్ని స‌గం భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రిగా శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ దేశంలో రోజుకు ల‌క్ష‌ల కొద్దీ యాప్ లు వ‌స్తున్నాయ‌ని, ఏది న‌మ్మాలో తెలియ‌డం లేద‌న్నారు. ఇక‌నైనా స‌ర్కార్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక పోతే వేలాది మంది మోసానికి గుర‌య్యే ప్రమాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : Umamaheswara Kalyanam : క‌మ‌నీయం ఉమామ‌హేశ్వ‌ర క‌ళ్యాణం

Leave A Reply

Your Email Id will not be published!