CM KCR Attend : బహ్మానందం కుమారుడి పెళ్లికి కేసీఆర్
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం
CM KCR Attend : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (కన్నెగంటి బ్రహ్మానంద ఆచారి) కుమారుడు సిద్దార్థ పెళ్లి హైదరాబాద్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరత మహారథులు, సినీ రంగానికి చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ , వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా రంగాలకు చెందిన వారు హాజరయ్యారు.
CM KCR Attend Brahmanandam’s Son Marriage
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్బంగా బ్రహ్మానందం కుమారుడు సిద్దార్థను, కోడలిని సీఎం కేసీఆర్(KCR) ఆశీర్వదించారు.
సీఎంతో పాటు ప్రముఖ నటులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రాకతో అక్కడంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
ప్రత్యేకించి బ్రహ్మానందం దంపతులు , తనయుడితో కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా రావాలని కోరారు. దీనికి కేసీఆర్ ఓకే చెప్పారు. అనుకున్నట్టుగానే సీఎం రావడంతో బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : Ayutha Chandi Yagam : అంగరంగ వైభోగం అతిరుద్ర యాగం